Sunday, September 18, 2011

On being a Cindrella man...


O ye! Owner of thy Kite


'మనకెందుకు ',' నాదికాదు ','రేపు చూద్దాం ', అనకు నేస్తం,
కాలం ఆగదు, బాథ్యత తరగదు, తాతకైన వాని మాతకైనా,

లొంగదు లంచానికి, వంగదు వారసత్వానికి, సమత్వం సమయం నైజం,
నేటి వాకిట పాడు సరిగమ, రేపు నిలచుట ఎంత నిజం?

కంటికందిన నింగితార చేతికందుట ఎంత కఠినం?
విజయగాథల తేనె మధురిమ విస్మరించుట ఎంత సులభం?

అలుపెరుగక జీవితం పరుగెడుతోంది శ్మసాన సంస్థాన ప్రవేశానికి,
వదిలిన బాణంలా తిరిగిరాదు దారి, చేయిదాటిన అవకాశానికి,

వాన సైతం కురుస్తుంది మబ్బుకు కలిగితే స్పందన,
కలల స్వర్గం ఇలన పొందుటకు కావాలిగా కాసింత ప్రేరణ.

No comments: