Rendezvous with the Rainbow |
నీరసించకు జనం నిన్ను నమ్మలేదని,
గడచి పోతుంది గ్రహణం తట్టుకోలేక సూర్యున్ని,
మంచితనానికి మహిన విలువ ఎప్పుడూ ఎనలేని,
విడువకు నీ సహనాన్ని, " ఇది నాది కాదని!"
మిణుగురు ధైర్యం చూడు, వొంటరిగా చీకటిని వోడిద్దామని,
క్రాంతి తనలోనే వుంటే తల వంచడం ఎందుకని?
బంగారపు ధగధగ తగ్గదు, మసక నా కంటిదైతే,
నిండు వెన్నల నవ్వదూ? మబ్బు " నేను గెలిచానంటే!"
వాన నీరుని నింగి కన్నీరు అంటారు, ఆకాశ పరవశం అనుకోరు ఎందుకు?
దృష్టి లోపానికి కానరావు సృష్టిలోనే మందులు.
కొవ్వొత్తికి తెలుసు కరుగుతున్నా, తన క్రాంతి తరగదని,
గొంగలికి తెలుసు నేడు ప్రాకుతున్నా, రంగుల భవితకు ఇంకెంతో లేదని...
No comments:
Post a Comment