Sunday, September 18, 2011

Lead, kindly Light!


a LITTLE prayer...to THEE


అక్షర జ్ఞానంబు అంబరమని, ఆత్మ జ్ఞానంబు అందలమని,
అమ్మ అనగా అమ్రుతంబని, అఖండ భారతంబు ఆత్మీయనిలయమని,
సోదరభావంబే సంస్కారసారమని, సఛ్ఛీలమే షోడశ సంపదయని,
సంగ్రహించినాము స్వామీ నీ చెంత, సిద్ధింపుము దీక్ష ఒకింత.

మంచితనమే మన నిజ నైజమని, మితభాషే మణిమాణిక్యంబని, 
క్రమశిక్షనే కఠిన కవచమని, కృషితో కృప ఖాయమని,
విమర్శలతో క్రుంగవలదని, విశ్వాసమే విజయ తిలకమని, 
విద్యనేర్చినాము స్వామీ నీ చెంత, ఒసగుము వివేకము ఒకింత.

జీవన గతిగమ్యము శాసించు నిరంతర దిక్సూచికమవమని 
క్లేశ దుర్లభమందున తోడు నిలచు వెలుగు సౌధమవమని, 
తెరచాప పయన గమనమును గమనించు పవనమవమని,
కోరుతున్నాము స్వామీ నీ చెంత, అనుగ్రహింపుము పలుకరింత... ఒకింత. 

No comments: