Monday, December 9, 2024

9 Gems

 

కెంపు లాంటి కోడలికి ఇంపైన కానుకలివి..

జాబిల్లి పోలు నీ ముందు వజ్రం ఒదిగి మెరవాలని...

వైడూర్యం తెచ్చు ఐశ్వర్యం మా చిన్ని కోడలి చిరునామాయని..

స్వచ్ఛమైన పుష్యరాగం పుష్కలంగా నిను చేయాలని..

వెచ్చనైన మా ప్రేమ నీకై పచ్చలా మెరవాలని..

పగడంలా జగడం లేని వ్యవహారం కలగాలని..

ముత్యంలా తెల్లని మనసు నీ సొంతం- ఇది సత్యమని...

శాంతం, విశాలం, నీలమైన నింగిలా నీ చుట్టూ చేరాలని..

మంగళ శుభాలు పసుపు గోమేదిక ములై కురవాలని..

నవరత్నాల నవ్యమైన అత్త కానుక మా ఐశ్వర్య రత్నకు...


on Aiyshu's function

No comments: