విద్య నిరంతరం, వినయం దాని సారం,
నైపుణ్యమవసరం, గర్వమొక భారం,
Knowledge is recurrent while humility is its undercurrent,
Essential is our talent but ego turns it blunt,
భక్తి శుభారంభం, జీవనం దాని బింబం,
మనస్సు మందిరం, మాట అచట పరిమళం,
Devotion is true when life is blended in it's brew,
At the altar of the conscience, sweet speech the only fragrance,
కర్మ నిష్కామం, కృషి మన ధర్మం,
కృప కర్మానుసారం, క్రమశిక్షణ సంస్కారం,
Selfless shall be our action and efforts primary obligation,
Grace follows acts noble, while discipline scripts our preamble,
ప్రేమ అమితం, మితం సర్వదా హితం,
సమయం అమూల్యం, విలువలు అతుల్యం,
Love is limitless and limiting desires leads to the limitless,
Time is precious while values turn us plenteous,
జీవితం ఓ వరం, కరుణ దాని ఫలం,
ముక్తికి సోపానం, రాదు మరో తరుణం,
Life is a present and is fructified with compassion abundant,
This is the highway to peace with second chance scarce,
నేర్పావు అనుక్షణం, అలుపెరుగని నీ వీక్షణం,
మరువలేని తీక్షణం, మరలరాదు ఆ క్షణం.
Hence taught by you always, under supervision stupendous,
The memories are magical and the moments irrepllicable!
* for alumni presentation on 24th Apr.,2019
No comments:
Post a Comment