Tuesday, September 9, 2014

నిరంతర స్రవంతిలో నిశ్శబ్ద ప్రభంజనమై,
నింగి వాకిట్లో వోలలాడు జాబిల్లి వెండి కిరణమై,

తొలకరిలా,పున్నమిలా,సుప్రభాతంలా,నవవసంతంలా,
నవీన తరానికి నాందిలా, జగానికి ఆశా జ్ఞాపికలా,

రానున్నాడు వో రవీంద్రుదు, మరో మహాత్ముడు, నవ నరేంద్రుడు,
దాగుంది వో వీర ఝాన్సీ, ధీర రుద్రమ, ధన్య థెరిస్సా,

మరో పుతలీ, మరో జీజా, మరో వొడిలోబడి ప్రారంభం,
మరి ఈ క్షణం వో చిన్నారికే కాదు, వో అమ్మకు కూడా ఆరంభం.

(from the archives - 2011)


No comments: