మందకొడిగా ఒకసారి,
మందలో ముందుండాలనొకసారి
ప్రాకుతూ, పడుతూ, పరిగెడుతూ
పంతం పగలతో పనికెలుతూ
దాచిదోచినా, పుట్టే తరతరాలకు
గుర్తురావులే నీవు, వారెవ్వరకు
శిలలూ, బడులూ నీ గౌరవార్థం
నీవే లేనపుడు వాటికేమర్థం?
ఏమి తేడా నరునికి, నల్లచీమకి?
కనుగొనాలి ఎవరికివారు వెతకి వెతకి!
No comments:
Post a Comment