అద్దె కొద్దిగ ప్రేమన్నావ్
తిప్పినా, తన్నిన్నా నవ్వి నిమిరావ్
ఎలా వున్నా బంగారమేనన్నావ్
అల్లరి చేసిన బానే మొట్టావ్
అలవాటుగా బుద్దులు నేర్పావ్
నవ్వడం, నమలడం, ఇవ్వడం, రాయడం
అంతటా వేసావు నీ చేతి కాపడం
పనులెన్నో చేస్తావు పద్దతిలో నాన్చి
తెలుస్తుంది నేడు ఇదే బ్రతుకు తివాచి
ఎక్కడుంటే ఏమైందిలే మరి !
కావలి జ్ఞాపకాల గిలిగింత విరివిరి