Tuesday, September 9, 2014





అలవాటుగా అబధ్ధము ఆడి ఆడి,
ఎప్పుడు అలసిపోతావో చెప్పు నేస్తం.

కల్లలతోనూ కుళ్ళుతోనూ కాలం గడుపుతున్నావు ,
అసలు ఏమి కావాలో తెలుసునా నేస్తం.

ఊసరవెల్లికి సిగ్గేస్తుంది నీ కళచూసి,
నీ అసలు రంగు గుర్తుందా నేస్తం?

వీడవా నీవు ఎపుడు దేహం?
దేనికోసమని ఇంత దాహం?

మణులగనులు వీడి పోయిరి,
కోటగుమ్మాలు దాటి పోయిరి.

మాహాత్ములకే ఆగలేదు తరుణం,
మంచిగా జీవించటానికి కావాలా ఇంకా కారణం!

(from the archives - 2011)

No comments: