Friday, May 25, 2012

Much ado?


Smile! Thou art free


నిషానింగి నక్షత్ర నీడలన నిదురించాలని వుంది,
నీలాంబరి నదీ తీరాన నవ్వుతూ నడవాలని వుంది,

తొలిరవి కిరణాల సరసన సవ్వడితో సాగాలని వుంది,
వెన్నల వెండి రేఖల నడుమ తేలిపోవాలని వుంది,

గాలి పటంలా, తటాకంలో తామరాకులా వుండాలి స్వేచ్ఛగా,
చిన్నవాని చేతిబలపంలా, నెమలి పింఛంలా, వుండాలి అపురూపంగా,

తేనెటీగలా,నల్లచీమలా సమయం గడవాలి తృప్తిగా,
కోకిల పాటలా, పసిడి పైరులా బ్రతుకు వుండాలి నిండుగా,

కొలవలేని కోరికల కొండ కరిగేది మరి ఎలా?
ఎగసిపడుతుంటే  తెగువ సాగే అలలలా,

ఆలోచించు! ఈ జీవితం నీది మాత్రమే,
జీవించకు మరొకరి కల, సమయం నిమిత్తమే.

No comments: