ఇంద్రధనుస్సు చందమున ఎల్లలు లేవు కలసివుండిన
నిత్యజీవన సమరమున వెన్నెలేగా నలుగురుండిన
చీమపుట్టలా తేనెపట్టులా కట్టబడిన మనమంతా
కలసివుండిన సాగిపోదా తేనె సంద్రమై బ్రతుకంతా
కడలి చుక్కకు కాలువ బొట్టుకు తేడా ఏమిటని శోదిస్తే
కొలతలొక్కటే మరి చెంతనెందరని నాది మది ప్రశ్నిస్తే
నా ఇంటినుండీ వీధిదాక, నా ఊరినుండీ పుడమి దాక
మనస్సు పెంచిన, చేయి చాచిన, పై స్వర్గమింక సాగబోదిక
వసుధైవ కుటుంబమే ఒకనాడు, కానరాదే మరి ఈనాడు?
స్వార్థము తరిగిన, సాయము పెరిగిన, వచ్చునులే అది మర్నాడు!
No comments:
Post a Comment