ఆవిరవనీకు నీ అలనాటి ఆశలను
ఆత్మవిశ్వాసముతో మార్చు ఆశయాలుగా
భువినీరు గురిపెట్టలేదా గగనానికి?
మరిగి, మాటువేసి, మారలేదా మేఘానిగా?
వేచి చూచి మారెనులే నీలానికి దాని చర్మము
నీటిబొట్టే! మరి ఆపగలదు, రవిని సైతము!
మనసునందు ముద్రించియుంది మరో భువనము
కానవచ్చు కనులు మూసిన అచటి గమనము
స్వేదబిందువు పారునులే సిద్దించుటకు సాఫల్యము
నడిపించు, నావను తోడుండగా కృషి పవనము!
1 comment:
కదిలించాలి నీ కలాన్నిలాగే కలకాలం
మేమానందించాలి నీ పవనతరంగం
నిరంతరం !
సుధీర్
Post a Comment