Monday, December 12, 2011

శబ్ద స్పర్శ రూప రస గంధాలు



జీవితం పిలుస్తోంది.....ఎక్కడ దాగున్నావు నా ప్రియనేస్తం?
తన అందాన్నిబంథించమని, చిత్రపటాలలో, చరిత్రపుటలలో,
నీ కనుల సంకెళ్ళు మరి సిద్దమేనా ఓ నేస్తం?

ప్రభాత రాగాలు, పవన తానాలు, నదుల పల్లవులు,
నీకు కూడా వినాలనుంది కదూ నా నేస్తం?
చినుకు సవ్వడి చవి చూడడానికి చవులు చిగురించాయా నా నేస్తం?

గిరితరుల గాలి తాకిడి, చిటపట చిరు వాన తడి,
కోరుతావులే నీవు ఆడి ఆడి, అలసినాక అమ్మ ఒడి,
సెలవుపెట్టు ఒక రోజు నేస్తం, ఆగదులే బ్రతుకు బడి.

పాదమంతే రక్ష కలగిన తప్పునులే తప్పటడుగులు,
మితములో తృప్తించకున్న, తప్పవులే తప్పుటడుగులు,
రుచియన్నది నాలుకకు లేదు, మనస్సునందునే మర్మంబస్సలు.

పరిమళానికై ప్రాకులాడకు, దొరికేవన్నీ వాడి వీడులే,
విచ్చిన మనస్సే మల్లెలాయే, హెచ్చిన ఉషస్సే గంధమాయే,
అందుకే, నీరు పోద్దాం బ్రతుకు మొక్కకు నీతి జలధి నుండీ...తోడితోడి