Wednesday, March 2, 2022

అనుకున్నాడేమో శివుడు!


సోమవారానికొకడు సంవత్సరానికొకడు,
గుడి నిండా తన పిల్లల్ని చూసి నవ్వుకొనేడు,
"అయినా కాలంతో నాకేమీ?" అనుకున్నాడేమో శివుడు!

ఫలహారాల జోరు అభిషేక జలపాతాల హోరు,
జలుబు చేస్తుందేమో ఈరోజు అనుకొనేరు,
"గంగే పారుతుండగా ఇదింకొక అల" అనుకున్నాడేమో శివుడు!

కోరికల చిట్టాలు చుట్టుచేరిన ఈ వేళ, 
చేయవలసిన కృషి స్వహస్తమున హలములా,
"వేప నాటిన తీపి మామిడేల?" అనుకున్నాడేమో శివుడు!

వేదము ఘోషించినా, విత్తము వెచ్చించినా, 
అడిగినచో మితము, అడగనచో హితము, 
"అనన్యా చింతయంతోమామ్ అన్నానుగా!" అనుకున్నాడేమో శివుడు!