Thursday, July 22, 2021

మా కల్పతరువు


కల్ల నుండి కాపాడు కంటక కంచె వోలె,
మేటి వన్నె దిద్దు మెత్తని కుంచె వోలె,

మా ఎదుగుదలకు సునెరవు నీవు,
జీవన తాపాన చల్లని తరువు నీవు,

ఎగబాకు తీగకు ఆధారము అమ్మ,
నింగిరంగుల పతంగానికి దారమేగా అమ్మ,

వేదమే ఘోషించె మొదటి మొక్కు అమ్మకని,
మాత మమతకు భూసంపద సరితూగదని,

పండ్ల రుచేగా మానుకు తెచ్చు మంచి పేరు,
మా సంస్కారమేగా నీకు వెయ్యి నూటపదహారు!