చావు బరువు మోసావా నువ్వు?
కన్నీరు వెచ్చనని చెబితే ఎలా నమ్మను?
బ్రతుకు తెరువు ఎట్లా అని అడిగావా నువ్వు?
రూపాయి విలువ తెలుసునంటే ఎలా నమ్మను?
మహిమ రుచి అనుభవించావా నువ్వు?
భక్తితో ప్రార్థించానంటే ఎలా నమ్మను?
మాటరాక మనసు కదిలి మారావా నువ్వు?
జాలిపడ్డానన్న జవాబు ఎలా నమ్మను?
గుండెను ఎకరాలుగా మర్చావా నువ్వు?
చదువుకున్నానని చెబితే ఎలా నమ్మను?