Saturday, July 19, 2014


సుప్రభాత వేళలో, వెన్నెల జోల పాటహాయిలో,
మీ అనురాగంలో, సంతోషపు సౌరభాలలో,
సరాగాలలో, తియ్యని విరామాస్వప్నాలలో,
రంగుల సవ్వడికి పలుకుతోంది మా కావడి స్వాగతం...సుస్వాగతం!  

(Swapna -Ramu engagement-2008)

మంచు కంటే తెల్లనైనది
నింగి కంటే విశాలమైనది
వెన్న కంటే మెత్తనైనది
సుధ కంటే తియ్యనైనది
వెన్నల కంటే చల్లనైనది
మా అమ్మ హృదయం అన్నిటిని మించినది

తెలియని తప్పులని క్షమించి
తెలిసిన తప్పులని చిరు నవ్వుతో దండించి
నేర్పుగ వోర్పుగ నను కని పెంచి
ఏమి ఇవ్వగలను ఇంతకు మించి
మాటలకందని ప్రతిరూపం
భావాలే నా ప్రేమకు రూపం.
(from the archives-2001)


పక్షుల రావముతో పులకించు మనసు
వాన జల్లులతో వికసించు మనసు
సూర్యచంద్రులతో ప్రకాశించు మనసు
భక్తిజ్ఞానములతో వికసించు మనసు
సన్మార్గములో పయనించు మనసు
సాయి నామముతో సంచరించు మనసు
ఈ నూతన సంవత్సరము మీకు తెస్తుందని నాకు తెలుసు!
---------------------------------------------------------------------------------------------
సున్నితంగా చెబుతోంది నా స్వచ్చమైన తెలుగు
ఈ నూతన సంవత్సరం తెస్తుంది మన బాటకు వెలుగు
మంచితనానికి, మన హృదయానికి పెడదాము నలుగు
సాయి కృపతో సుఖసంతోషాలు మనకు ఖచ్చితంగా కలుగు!
(from the archives-2002)




మనో నిర్లిప్తతకు వికాస విహంగానివై,
అస్పందిత హృదయానికి లేత మొలకవై,

భావ దారిద్ర్యానికి మెండు పాండిత్యమై,
శబ్ద గాంభీర్యానికి సుమధుర స్వర పేటికవై,

కుటిలశోచనలకు స్ఫటిక స్పందనవై,
పురాతన పదాలకు నవీన పరిభాషవై,

ఎట్లు తెలిపెద నీ సాంగత్య మహాత్మ్యము స్వామీ,
ధైర్య మొసంగు నెరవేర్చుటకు మా నిరంతర హామీ!





" ఏమి చేస్తే ఆనందిస్తావు? 
ఏమి ఇస్తే మురిసిపోతావు?"
అనుకుంటూ పొడుకున్నా,
రాని నిద్రకై రాత్రంతా.

మాయని, మూయని,మరువని, మారని,
వాడని, వీడని, వేదన నొసగని,
వస్త్రమేదని? వస్తువెచటని?   
వెళ్ళాను వెతుకుతూ వెన్నెల దారిని.

వెంటవుంటేనే వస్తువుకు విలువ,
ధర వుంటేనే కనకమునకు చొరువ,
దీవించు! నిను సదా సంతసింపాలని,
కాదు కానుకలతో, నెలవైన విలువలతో.